జ‌గ‌న్‌కు క్లీన్ చిట్‌..

9846
0

ప‌దివేల కోట్ల న‌ల్ల‌ధ‌నం ప్ర‌క‌టించిన ఆ బ్లాక్ మిలియ‌నీర్ ఎవ‌ర‌నేది ఆంధ్రాలో అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. అది ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి చెందిన‌ సొమ్మే.. అని తెలుగుదేశం నేత‌లు ఆరోపించారు. జగన్ దాన్ని ఖండించినా కూడా ఎలాంటి ఆధారం లేకుండా అదే మాటను అధికార పార్టీ నేత‌లు పదేపదే ఆరోపించారు. దీంతో జగన్ ఆ డబ్బు తనది కాదని ప్రకటించి.. ఆ పదివేల కోట్ల సంగతి తేల్చాలంటూ ప్రధానికి జగన్ లేఖ కూడా రాశారు. జగన్ లేఖ నేపథ్యంలో విచారణ జరిపిన ఐటీ శాఖ 10వేల కోట్లు సంగతి అవాస్తవమని తేల్చేసింది. ఒక వ్యక్తి పదివేల కోట్లు డబ్బును చూపించారంటూ జరిగిన ప్రచారం వెనుక అసలు సంగతి వెల్లడించింది.

స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం అప్లికేషన్ లో ఒక వ్యక్తి సంచలనం కోసం తన ఆదాయాన్ని రూ.10వేల కోట్లుగా చూపారట. దాని ఆధారంగా విచారించగ సదరు వ్యక్తికి కోటి రూపాయలు చెల్లించే స్థాయి లేదని తేలింది. చిన్న కుటీర పరిశ్రమను నడుపుతున్న ఆ వ్యక్తి సంచలనం చేయడానికి ఇలా చేశాడని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యక్తికి చెందిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఐటీ శాఖ నిరాకరించింది. మొత్తం మీద చంద్రబాబు – దేవినేని ఉమా లాంటి మంత్రులు చేసిన ఆరోపణలు అబద్దమని ఐటీ శాఖే తేల్చేసింది. ఆర్‌బీఐ అధికారులు అస‌లు గుట్టు ర‌ట్టు చేయ‌డంతో టీడీపీకి భంగ‌పాటు ఎదురైంది.

కాగా, ఆ బ్లాక్ మ‌నీ చంద్ర‌బాబు అనుచ‌రుడిది అంటూ ప్ర‌తిప‌క్షాలు మ‌రో కొత్త వాద‌న తెర‌మీదికి తెచ్చారు. ఆ న‌ల్ల‌ధ‌న కుబేరుడు ఎవ‌రంటూ అన్ని వ‌ర్గాల్లోనూ కొత్త చ‌ర్చ మొద‌లైంది. అంత మొత్తంలో బ్లాక్‌ను వైట్ చేసుకున్న‌ది టీడీపీ నేత ఆదికేశ‌వుల నాయుడే అనే అనుమానాలు ఇప్పుడు కొత్త‌గా ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఆ సొమ్ము ఆయ‌న‌దే అయి ఉంటుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇటీవ‌లే ఆయ‌న భార్య, చిత్తూరు శాస‌న స‌భ స‌భ్యురాలు స‌త్య‌ప్ర‌భ ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయి. లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాతో ఈ ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉంద‌నీ, ఆయ‌న స్వ‌దేశీ బ్యాంకుల‌కు రూ. 9 వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టి దేశాన్ని దాటేస్తున్న సంద‌ర్భంగా ఈ ఫ్యామిలీ ద‌గ్గ‌ర కొంత సొమ్ము దాచుకున్నార‌ని అనుమానించారు. ఆ కోణంలో ఐటీ దాడుల జ‌రిగాయ‌నీ, పెద్ద ఎత్తున ఆస్తులు దొరికాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు, ఈ ఫ్యామిలీ న‌డుపుతున్న కాలేజీలో కూడా పెద్ద మొత్తంలో బ్లాక్ మ‌నీ ల‌భించింద‌ట‌. కాబ‌ట్టి ఆ న‌ల్ల‌ధ‌న‌వంతుడు ఆదికేశ‌వుల నాయుడే అయి ఉంటార‌ని వాణిజ్య వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒక‌వేళ ఇదే క‌రెక్ట్ అయితే ఈ విష‌యంలో తెలుగుదేశం సెల్ఫ్ చేసుకున్న‌ట్టు అవుతుంది. ఇన్నాళ్లూ ఆ న‌ల్ల‌ధ‌న‌వంతుడు జ‌గ‌నే అంటూ దేశం వెలెత్తి చూపింది. ఇప్పుడు, అది తెలుగుదేశం పార్టీకి చెందిన‌వారిదే అనే ప్ర‌చారం మొద‌లైంది. ఈ తాజా ప్ర‌చారంతో టీడీపీకి అవినీతి మ‌రక ప‌డింది. ఏదేమైనా, ఈ బ్లాక్ మ‌నీ గొడ‌వ ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేట్టుగా లేదు.

SHARE