ఆ కూర తింటే మ‌గ‌త‌నం నాశ‌నం… య‌మ డేంజ‌ర్‌

799
0

పౌష్టికాహార లోపంతో బాధపడేవారికి డాక్టర్లు చాలా ర‌కాల కూర‌లు తీసుకోమ‌ని స‌ల‌హాలు ఇస్తుంటారు. పౌష్టికాహారం కోసం తీసుకునే కూర‌ల్లో చాలా వ‌ర‌కు మ‌నిషికి శ‌క్తినిస్తాయి. ఈ కూర‌ల్లో ఒక కూర మ‌గ‌త‌నానికే చాలా ముప్పుగా మారుతుంద‌ట‌. అదే సోయా.. సోయా ఇప్పుడు మగాళ్ల పాలిట శాపంగా మారుతోందట. ప్రత్యేకించి తండ్రులు కావలసిన వారిపై ఇది చాలా దుష్ప్ర‌భావం చూపుతుంద‌ట‌.

మ‌నిషి తీసుకునే ఆహారంలో సోయా స్థాయి ఎక్కువైతే మ‌గాళ్ల‌లో వీర్య‌క‌ణాల మీద ప్ర‌భావం చూపి…వారు తండ్రయ్యే అవకాశాలు తగ్గిపోతాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. సోయాలోని రసాయనాలు వీర్యాన్ని దెబ్బ తీస్తున్నట్లు ఆ స‌ర్వేలో తేలింది.

స్పెయిన్‌లోని వాలెన్సియా వర్సిటీ – బ్రిటన్‌లోని ఐవీఐ ఫెర్టిలిటీ కేంద్రం నిపుణులు కలసి చేసిన స‌ర్వేలో ఈ షాకింగ్ విష‌యం వెల్ల‌డైంది. 25 మంది మగాళ్లు ఈ సర్వేలో పాల్గొన్నారట. దాదాపు రెండేళ్లపాటు వీరి ఆహారంలో సోయా స్థాయిలు ఎక్కువగా ఉండేలా ప్రయోగం చేశారట. సోయా పైపొరల్లో ఉండే బిస్ఫెనాల్ ‌ -ఏ అనే రసాయన ప్రభావాన్ని గుర్తించేందుకు ఈ ప్రయోగం చేపట్టారట.

ఈ ప్రయోగంలో అంద‌రూ షాక్ అయ్యేలా ఫైటో ఈస్ట్రోజన్‌గా పిలిచే మరో రసాయన ప్రభావం బయటపడిందట. ఇది వీర్య కణాల ఉత్పత్తి స్పీడ్ తగ్గిస్తోందట. అంతేకాదు క్రోమోజోమ్‌ల నిష్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోందట. ఇటీవల కాలంలో మాంసానికి ప్రత్యామ్నాయంగా సోయా ఉత్పత్తులను బాగా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా డేంజర్ అంటున్నారు పరిశోధకులు

SHARE