కిరణ్ కుమార్ రెడ్డి వైస్సార్సీపీ లో జాయిన్ అవడానికి ముహూర్తం ఖరారు..

18473
0

రాజకీయాలు అన్నాక ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఈ రోజు పార్టీకి జై కొట్టినవాళ్ళే రేపు విమర్శలకి తావిస్తారు. నేడు అధినేతని పొగిడిన వాళ్ళే రేపు విమర్శలతో ఛీదరిస్తారు. ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో కొత్తేమి కాదనుకోండి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎదురుకానుందనే వార్త నడుస్తుంది. ఇప్పటి వరకు తనకి బలంగా వున్నా తన సొంత సామజికవర్గం(రెడ్డి) వాళ్లే ఇప్పుడు అతడిని విమర్శించటానికి, పార్టీ వీడటానికి సిద్దమౌతున్నదని తెలుస్తుంది.

ప్రస్తుతం జగన్ ప్రవర్తన, ఆయన వైఖరి ఏమి బాగోలేదని రెడ్డి సామజికవర్గం గుర్రుగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీని ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు వీడి అధికార పార్టీలోకి చేరారు. ఇలాంటి పరిణామాల మధ్య పార్టీకి, జగన్ కి దన్నుగా వున్న ఆయన సామజికవర్గానికి చెందిన ముఖ్యనేతలు పార్టీ వీడనుండటం గమనార్హం. జగన్ కి ఝలక్ ఇవ్వటానికి అతనికి దన్నుగా వున్నా సీమప్రాంతం, నెల్లూరు జిల్లాలో వున్నా ముఖ్య నేతలే సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది.

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, చిత్తూరు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కి ఎంతో కావలసినవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ వీడటానికి సిద్ధమౌతున్నారు. జగన్ వైఖరి ఈ ఇద్దరి నేతలకి తీవ్ర ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్ తమని సంప్రదించలేదని మేకపాటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు ఎదురైనప్పుడు మేకపాటి తన ఫ్యామిలీతో కలిసి టీడీపీలోకి వెళతారన్న ప్రచారం కూడా జరిగింది.

జగన్ సన్నిహితుడైన పెద్దిరెడ్డికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఎప్పటి నుండో గొడవలు వున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ మాజీ సీఎంని వైసీపీలోకి చేర్చుకుంటాడని తెలిసి పెద్దిరెడ్డి కూడా అతని కుమారుడు రాజంపేట ఎంపీ మిదున్ రెడ్డితో కలిసి సైకిల్ ఎక్కడానికి సిద్దమౌతున్నాడు. ఇదే జరిగితే రెడ్డి సామజికవర్గం జగన్ ని ఒంటరి చేసినట్లే అని, వచ్చే ఎన్నికల్లో అతడికి పరిస్థితి క్లిష్టతరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

SHARE