జ‌గ‌న్ పై ఉన్న కేసులను కొట్టివేయనున్న ఈడీ..

43806
1

ఇదే చ‌ర్చ సాగుతోంది. టీడీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం న‌డుస్తోంది. ఆ పార్టీ నేత‌లే ఇప్పుడు జ‌గ‌న్ కేసులు చుట్టూ చ‌ర్చ జ‌రుపుతున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి తోడ్ప‌డిన అంశాల్లో జ‌గ‌న్ అవినీతి కేసులు ఒక‌టి. ఇప్ప‌డు ఆ కేసులే ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చేస్తే అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. అందుకే టీడీపీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈడీ కేసుల్లో జ‌గ‌న్ కి ఎందుకు ఉప‌శ‌మ‌నం దొరుకుతుంది..ఎలా కేసులు క్లోజ్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌న్న దానిపై చ‌ర్చ‌లు సాగిస్తున్నారు.

తాజాగా టీడీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం జ‌గ‌న్ కి బీజేపీలోని ఓ వ‌ర్గం బ‌లంగా స‌హ‌క‌రిస్తోంది. జ‌గ‌న్ ని గట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ డీ కేసుల నుంచి రిలీఫ్ కి త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కేంద్రం స‌హ‌క‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంటే జ‌గ‌న్ త‌న మీదున్న ఈడీ కేసులు తొల‌గించుకోవ‌డానికి అన్ని ర‌కాలుగాను అవ‌కాశాలు మెరుగుప‌రుచుకున్న‌ట్టే లెక్క‌. ఈ ప్ర‌చారం టీడీపీ సీనియ‌ర్ నేత‌లే చేస్తున్నారు. ఆపార్టీ వ‌ర్గాలే దీనిని ప్ర‌చారంలో పెడుతున్నాయి.

ఈడీ కేసుల నుంచి ఉప‌శ‌మ‌నం కోసం జ‌గ‌న్ ఫైన్ క‌ట్టే అవ‌కాశం ఉంద‌ని స‌మ‌చారం. అందుకు తగ్గ‌ట్టుగా కేసుల్లో మార్పులు సాగించే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ కేసుల్లో ఉన్న కంపెనీల త‌రుపున ఈడీకి ఫైన్ క‌ట్ట‌డానికి సిద్ధ‌మ‌యిన‌ట్టు కూడా చెబుతున్నారు. అది పూర్త‌యితే ఇక కేసుల తొల‌గించ‌డం ఖాయం. అయితే ఫైన్ క‌డితే త‌ప్పు అంగీక‌రించిన‌ట్టే అనే భావ‌న రాకుండా కంపెనీల త‌రుపున క‌ట్ట‌డం ఒక‌టి, ఫైన్ క‌ట్టిన త‌ర్వాత ఈడీ వేధింపులంటూ కోర్టుకెళ్ళే ఆలోచ‌న కూడా చేస్తారా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. అయితే ప్ర‌స్తుతానికి కేసుల నుంచి రిలీఫ్ ద‌క్క‌డం అత్య‌వ‌స‌రం కాబ‌ట్టి అవ‌స‌ర‌మైతే కండీష‌న్స్ కి అంగీక‌రించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. ఇదంతా ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం శ్రేణుల‌కు మింగుడుప‌డని ఈ అంశాన్ని కేంద్రం, జ‌గ‌న్ కుమ్మ‌క్క‌య్యార‌న్న కోణంలో ప్ర‌చారం మొద‌లెట్టేశారు. మ‌రి నిజంగా అలా జ‌రుగుతుందా..జ‌రిగితే ఫ‌లితాలేంట‌న్న‌ది వేచి చూడాల్సిందే.

SHARE