‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రివ్యూ…

223
0

సినిమా పేరు: గౌతమీపుత్ర శాతకర్ణి తారాగ‌ణం:

బాల‌కృష్ణ‌.. శ్రియ‌.. హేమ‌మాలిని.. క‌బీర్ బేడి.. శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు

సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌ ఛాయాగ్ర‌హ‌ణం:

జ్ఞాన‌శేఖ‌ర్‌ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మాట‌లు:

సాయిమాధ‌వ్ బుర్రా కళ: భూపేష్ భూపతి

నిర్మాత‌లు: వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్ల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: బిబో శ్రీనివాస్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి

సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

విడుద‌ల‌: 12-01-2017

సమయం లేదు మిత్రమా అని బాలయ్య చెప్పిన ఆ టైమింగ్ మన ముందు సాక్షాత్కరమైంది. శిథిలమైన పుటలల నుండి తీసిన తెలుగు వాడి చరిత్ర ని తెలుసుకొని గర్వంగా ఫీలయ్యే సమయం ఆసన్నమైంది.నందమూరి బాల‌కృష్ణ‌ను సంక్రాంతి హీరో అంటారు. ఆయ‌న సినిమాలు సంక్రాంతికొచ్చాయంటే సంద‌డే సంద‌డి. . ఈసారి వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌త్యేక‌మైన‌ది. బాల‌కృష్ణ సినీ ప్ర‌యాణానికి ఓ కీల‌క‌మైన మైలురాయిలాంటి వందో చిత్రం. అది కూడా చారిత్రాత్మ‌క క‌థ‌తో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రాత్మ‌క పాత్ర‌ల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. తెలుగు జాతి వీర‌త్వాన్ని చాటి చెప్పిన శ‌క‌పురుషుడు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌లో బాల‌య్య‌ను.. ఆయ‌న హావ‌భావాల్ని.. పౌరుషంతో చెప్పిన సంభాష‌ణ‌ల్ని ప్ర‌చార చిత్రాల్లో చూసిన‌ప్ప‌ట్నుంచి ప్రేక్ష‌కుల్లో ఆత్రుత‌.. అంచ‌నాలు అంతకంతకూ పెరిగిపోయాయి.

కథ..: ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటారు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి(కబీర్‌బేడీ)ని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తారు. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తారు. అయితే.. అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా ఓడించాడు? తాను కలలుగన్న అఖండభారతావనని ఎలా సృష్టించాడు? ఎలా ఉందంటే.. తెలుగు జాతి తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమిది. బాలకృష్ణ కోసమే పుట్టిన కథ ఇది.. ఆయన మాత్రమే చేయగలరేమో అనిపించేలా ఉంటుంది. ప్రధానంగా యుద్ధ ఘట్టాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. కానీ వాటిల్లోనే బలమైన భావోద్వేగాలు పండాయి.నహపాణుడిని ఓడించే సన్నివేశాలు.. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట దృశ్యాలు సినిమాకి కీలకంగా మారాయి. నహపాణుడు సామంతరాజల వారసులని తనదగ్గర బంధించి.. యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణిని తన కొడుకు పులోమావిని తీసుకుని రమ్మని చెప్తాడు. అందుకు తగ్గట్లే శాతకర్ణి యుద్ధానికి కుమారుడిని తీసుకెళ్తాడు. దానిపై శాతకర్ణి భార్య వాసిష్ఠి దేవి అడ్డుచెప్పే సన్నివేశాలు ప్రేక్షకులన్ని కంటతడి పెట్టిస్తాయి. రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువు పట్టులా నిలిచాయి. మాతృమూర్తి గొప్పతనాన్ని చాటిచెబుతూ ఆ ఘట్టాలు సాగుతాయి. డెమిత్రియస్‌పై యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినప్పటికీ అందులో బాలకృష్ణ చేసే విన్యాసాలు, ఆయన నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక సంభాషణలు సినిమాకు ప్రధాన బలం. యుద్ధ సన్నివేశాలకు దీటుగా ఒకొక్క మాట ఓ తూటాలా పేలింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనే భావన తెరపై ఎక్కడా కలగదు.ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్‌ అంశాలను జోడించి చెప్పిన విధానం క్రిష్‌ పనితనానికి అద్దం పడుతుంది.

ఎవరెలా చేశారంటే.

. ఇది బాలకృష్ణ ఒన్‌మాన్‌ షో అన్నట్లు సాగుతుంది. ఓవైపు భావోద్వేగాలను ఎంత అద్భుతంగా పండించారో.. అటు పోరాటఘట్టాల్లోనూ ఆయన ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ చురుగ్గా కన్పించారు. అలాగని ఇతర పాత్రలని తక్కువగా చూడలేం. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రియ వాసిష్ఠిదేవిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. నహపాణుడిగా కబీర్‌బేడి ఆకట్టుకుంటారు. సాంకేతికంగా ఈ సినిమాకు వందకు వంద మార్కులు వేయాల్సిందే. దర్శకుడు పనితనం అడుగడుగునా కన్పిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా శాతవాహనుల కాలంలో ఉన్నామేమో .. శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇదొక చారిత్రాత్మక చిత్రమనే భావన కలగనీయకుండా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయిసాయిమాధవ్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణల చాతుర్యం కన్పిస్తూనే ఉంటుంది. యుద్ధం ఆవశ్యకతని బాలకృష్ణ, హేమమాలిని చెప్పే సంభాషణలతో పాటు బౌద్ద గురువులు ‘నువ్వు కడుపున మోస్తున్నది ఓ మారణహోమాన్ని’ అని చెప్పే మాటలు థియేటర్‌లో మరింత ప్రభావంగా విన్పించాయి. సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు ఇలా వేటికమే సాటి అన్పిస్తాయి.

ప్లస్‌ పాయింట్స్‌ * కథ, కథనం * బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని నటన * క్రిష్‌ దర్శకత్వ శైలి * సాయిమాధవ్‌ సంభాషణలు

రేటింగ్ ..3.5/5

SHARE