మీకు పెళ్లి వయసు వచ్చిందో లేదో తెలుసుకోండిలా..

483
0

పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు కదా. నిజానికి మనిషి జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వెయ్యి అబద్ధాలాడైనా సరే ఓ పెళ్లి చేయాలన్నారు. ఎందుకంటే, మన జీవితంలోకి వచ్చే భార్య జీవితాంతం మనకు తోడునీడగా.. కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో సాయపడుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి ఒక నిర్ణీత వయసులో చేసుకుంటేనే జీవితం సార్థకమవుతుంది. చాలా మంది ఏవేవో చిన్న చిన్న కారణాలతో తమ వైవాహిక జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ పొరపాటుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ప్రధానమైనది వయసు.

2

సరైన సమయంలో అంటే పెళ్లికి సరిపడా వయసు వచ్చినప్పుడు వివాహం బంధం ఏర్పరచుకుంటే ఎక్కువకాలం సుఖమయంగా జీవితాన్ని గడపవచ్చు. అలాకాకుండా ఎటూకాని వయసులో అంటే ముందుగానే లేక బాగా ఆలస్యంగానే పెళ్లి చేసుకుంటే అనేక సమస్యలు వచ్చి వివాహ బంధంపై తేడా చూపిస్తుంది. అయితే పెళ్లికి సరైన వయస్సు ఎంత ఉండాలనే లెక్క ఒక్కొక్కరు ఒక్కోటి చెబుతారు.

BACK
1/4
NEXT
SHARE