ఐడియా తీసుకొచ్చింది అన్ లిమిటెడ్ 3G/4G ఆఫర్

304
0

జియో ప్రభావంతో ఇంటర్నెట్ చాలా చవకగా మారిపోయింది. ఒక జీబీ డేటా కోసం కూడా వందల రూపాయలు ఖర్చు చేసే రోజులు ఎప్పుడో పోయాయి. దాంతో జియో కాకుండా, భారతదేశంలోని ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీలన్నీ నష్టాలు కల్లజూస్తున్నాయి. జియో లాగా అన్ని ఉచితంగా ఇచ్చే స్థోమత లేక, జనాల్ని ఏదోవిధంగా తమ కంపెని ఇంటర్నెట్ వాడేలా ప్రోత్సహించడానికి ఒకదాని తరువాత మరొకటి పోటిపడి ఆఫర్లు అందిస్తున్నాయి.

ఈమధ్యే 16 రూపాయలకే గంటసేపు లిమిట్ లేని 4G/3G వాడుకునే ఆఫర్ తో వోడాఫోన్ ఒక్క కొత్త ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ, ఐడియా కూడా అలాంటి ఆఫర్ ఒకటి అందిస్తోంది.

14 రూపాయలు చెల్లిస్తే చాలు, గంటసేపు అన్లిమిటెడ్ 3G డేటా మీ సొంతం. అదే 22 రూపాయలు చెల్లిస్తే, గంటసేపు 4G/3G ఎంతైనా వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ అన్నమాట. ఇదే పద్ధతిలో ఎయిర్ టెల్ కూడా ఓ మంచి ఆఫర్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

SHARE