టీడీపీ నాయకుడితో విసిగిపోయిన జేసీ.. వైస్సార్సీపీ లో చేరడానికి సిద్ధం..

14163
0

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. అధికార పార్టీతో విసిగిపోయిన టీడీపీ ఎంపీ ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. గ‌త కొంత కాలంగా అనంత‌పురం జిల్లాలో జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిల మ‌ధ్య వ‌ర్గ పోరు న‌డుస్తోంది. అయితే ఈ విష‌యంలో అధినేత క‌లుగ‌జేసుకోక‌పోవ‌డంతో వివాదం పెద్ద‌దైంది. దీంతో ఆగ్ర‌హించిన ఎంపీ నిన్న‌ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనంతపురం అభివృద్ధి కోసం ఎందాకైనా పోరాడుతాన‌ని, అవ‌స‌ర‌మైతే చేతులు ప‌ట్టుకుంటాన‌ని, విన‌క‌పోతే కాల‌ర్ ప‌ట్టుకుంటాన‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. న‌గ‌రంలో రోడ్డ విస్త‌ర‌ణ ప‌నుల‌కు ఎమ్మెల్యే, కమిషనర్, మేయర్ అడ్డుపడుతున్నారని జేసీ ఆరోపించారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక పార్టీ మారాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

రాజకీయం చేస్తూ రోడ్ల విస్తరణ పనులను అడ్డుకోవడం చాలా బాధ కలిగిస్తోందని, అభివృద్ధికి సహకరించే వారి కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమేనని, రోడ్ల విస్తరణ పనులు జరిగేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని జేసీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న త్వ‌ర‌లోనే పార్టీ మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

SHARE