వైకాపాలోకి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌..!

6848
0

ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష వైకాపా విల‌విల్లాడింది. అయితే ఇప్పుడు సీన్ మారింది..వైకాపాలో ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌లు స్టార్ట్ అవ్వ‌డంతో ఆ పార్టీకి ఊపురాగా..పార్టీ అధినేత జ‌గ‌న్‌లో జోష్ వ‌చ్చింది. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ వైకాపా ఆప‌రేష‌న్ రిక‌వ‌రీ పేరుతో కాస్తో కూస్తో బ‌లం పుంజుకుంటోంది.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు ఏకంగా బీజేపీ నుంచి వైకాపాలో చేరారు. ఇక అదే విజ‌య‌వాడ న‌గర మ‌రో మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు సైతం వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ క్ర‌మంలోనే స‌మైక్యాంధ్ర‌లో మంత్రిగా ప‌నిచేసి, ఐదుసార్లు కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సైతం వైకాపాలోకి జంప్ చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

క‌న్నా బీజేపీలో చేరిన తరువాత బీజేపీ అగ్రనేతల నుంచి ఆయ‌న‌కు ఆరంభంలో బాగానే సహకారం అందింది. మిత్రపక్షమైన టీడీపీని విమర్శించడంలో ఆయ‌న‌ దూకుడు చూపించారు. త‌ర్వాత క‌న్నాను బీజేపీలో ప‌ట్టించుకునే వారే లేరు. ఆయ‌న ఏపీ బీజేపీ ప‌గ్గాల కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక ఏపీలో బీజేపీ ఎద‌గ‌దు…ఆ పార్టీకి ఫ్యూచ‌ర్ లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన క‌న్నా చూపులు ఇప్పుడు వైకాపా వైపు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

క‌న్నాను పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ రెడీగా ఉన్నార‌ట‌. పార్టీలో చేరితే క‌న్నాకు ఎమ్మెల్యే సీటుతో పాటు ఆయ‌న కుటుంబానికి గుంటూరు న‌గ‌ర రాజ‌కీయాల్లో మంచి ప్రాధాన్యం ఇస్తాన‌ని కూడా జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే క‌న్నా త‌న‌కు రెండు ఎమ్మెల్యే సీట్లు కావాల‌ని కండీష‌న్లు పెట్ట‌గా, జ‌గ‌న్ విముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్‌. ఏదేమైనా క‌న్నా వైకాపా ఎంట్రీ రేపో మాపో ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

SHARE