రికార్డులను తిరగరాస్తున్న కాటమరాయుడు టీజర్..!

332
0

పవన్ కళ్యాణ్ హీరోగా డాలి దర్శకత్వంలో వస్తున్న చిత్రం..కాటమ రాయుడు.ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది..ఈ టీజర్ కు అమితమైన స్పందన వస్తుంది.విశేషమైన అభిమానులను ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో తన సత్తాను చాటుతుంది.రికార్డులను తిరగ రాస్తుంది.ఏ చిత్రం సంపాదించలేని క్రేజీని కాటమ రాయుడు అందుకుంటున్నాడు.

అత్యధిక వేగం గా విడుదలైన ఐదు గంటల్లో రెండు మిలియన్ల వ్యూస్ ను సంపాదించుకుంది. మతి పోగొట్టే పవర్ స్టార్ స్టైల్ కు దాసోహం అంటున్నారు. ఆయన విసురుతున్న డైలాగులకు ఫిదా అవుతున్నారు.విడుదలైన కొన్ని గంటల్లోనే ఇలాంటి ఆదరణ పొందుతుండటం తో చిత్రబృందం,అభిమానులు సంబరంలో మునిగిపోయారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

SHARE