ఫేస్‌బుక్ లో కొత్త ఆప్షన్ ఇక మొబైల్ బ్యాలన్స్ తో పని లేదు

756
0

ఫేస్‌బుక్ లో మరో ఫీచర్ చేరింది. గ్రూప్ వీడియో చాట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. పేస్ బుక్ యాప్ వలన మనకి బాలన్స్ అవసరం లేదు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ మరియు వీడియో గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోస్ ఫోన్లతోపాటు డెస్క్‌టాప్ వెర్షన్‌పైనా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

మెసేంజర్ లో వీడియో కాల్స్ మాత్రమే కాదు.. వీడియో చాటింగ్ కూడా చేయొచ్చు అంటోంది ఫేస్ బుక్. సరికొత్త వీడియో గ్రూప్ చాట్‌లో ఒకేసారి ఆరుగురు వ్యక్తులను చూడొచ్చు. అంతేకాదు మరో 50 మంది వరకు గ్రూప్‌లో జాయిన్ కావొచ్చని తెలిపారు. వీడియో గ్రూప్ చాట్‌ యాప్‌ను పొందేందుకు లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

SHARE