చిరంజీవి రీఎంట్రీ పై రాజమౌళి కామెంట్..

340
0

దశాబ్ధం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ”ఖైదీ నెం 150” ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఏసినిమా వచ్చినా దాని గురించి అగ్రదర్శకులు ఏమనుకుంటారో అనే ఆసక్తి సర్వత్రా ఉంటుంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమాపై స్పందించారు. ఖైదీ నెం 150 చూసిన వెంటనే జక్కన్న ట్వీట్ చేశారు. బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవి గారూ వెనక్కి వచ్చేసినందుకు థ్యాంక్స్. 10 ఏళ్ళు మిమ్మల్ని చాలా మిస్సయిపోయాం. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ ప్రాజెక్టుగా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్ చరణ్. వినయ్ గారూ.. కుమ్మేశారంతే. మీకంటే ఈ సినిమాను ఎవ్వరూ బెటర్ గా హ్యాండిల్ చేయలేరు. ఖైదీ టీమ్.. హ్యావ్ ఏ బ్లాస్ట్” అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఆయన బాటలోనే మిగతా హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు ఈ సినిమాపై తమ స్పందనను వెలిబుచ్చారు.

SHARE