యంగ్ ఏజ్ లోనే హార్ట్ అటాక్ రావడానికి కారణాలు..

429
0

గుండెజబ్బుల గురించి ఇటీవల జరుగుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులు, ఇతరులతో పోలిస్తే మన దేశవాసుల్లో స్వతహాగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు… అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండటం కోసం ఉపయోగించే మార్జరిన్ వంటి నూనెలు, కొవ్వులు ఉండే పదార్థాలు వాడటంతో పాటు ఇటీవల శరీరంలో ఎక్కువగా కదలికలు లేని తరహా వృత్తులు పెరగడం, దాంతో శరీరానికి అవసరమైన కొద్దిపాటి కదలికలు కూడా లేకపోవడంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు ఎక్కువవుతూన్నాయి. ఈ గుండెజబ్బుల వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తున్న సంఘటనలూ ఎక్కువగా చూస్తున్నాం. ఒక సారిమీ నడుం కొలతను ఒకసారి చూసుకోండి.

మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి. పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.

SHARE