2019లో జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అనడానికి కారణాలు..

2072
0

ప‌ల్నాడులో మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద రెడ్డి మ‌నువ‌డు కాసు కృష్ణ రెడ్డి కొడుకు కాసు మ‌హేష్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఏర్నాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ విజ‌యవంతంగా ముగిసింది.

ఈ స‌భ‌లో వైసీపీ అధ్యక్షుడు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాసు మ‌హేష్ రెడ్డిని వైసీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ భారీ బ‌హిరంగ స‌భ‌కు ల‌క్ష‌లాదిగా అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. స‌భా ప్రాంగ‌ణం మొత్తం జ‌గ‌న్ నామ‌ స్మ‌ర‌ణ‌ల‌తో మారు మోగిపోయింది.

స‌భ‌లో మొద‌ట కాసు మ‌హేష్ రెడ్డి అభిమానులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. పౌరుషాల‌కు మారుపేరైన ప‌ల్నాడు ప్ర‌జ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు… 2004 ముందు రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే మ‌ళ్లీ అదే ప‌రిస్ధితులు ఏర్పాడ్డాయ‌ని కాసు మ‌హేష్ అన్నారు.

రాష్ట్రంలో అవినీతి రాజ్య‌మేలుతుంద‌ని చంద్ర‌బాబు నియంతగా మారార‌ని అందువల్ల చేయి చేయి క‌లిపి ముందుకు సాగుదాం…. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని ముఖ్య‌మంత్రిని చేద్దామ‌ని పిలుపునిచ్చారు. జ‌గ‌న‌న్న‌ని ముఖ్య‌మంత్రిని చేసి రాష్ట్రానికి పట్టిన శ‌నిని వ‌దిలిద్దాం అని అన్నారు. ప‌ల్నాడు ప్ర‌జ‌ల రుణం తీర్చుకునేందుకే వైసీపీలో చేరుతున్నానని ప్ర‌క‌టించారు.

అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ కాసు మ‌హేష్ ను మ‌న‌స్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాని అన్నారు. మ‌హేష్ పార్టీలోకి వ‌చ్చేట‌పుడు…. మ‌హేష్ నీవు తోడుగా రా… అన్న‌లా నేను అండ‌గా నిల‌బడ‌తాన‌ని చెప్పిన‌ట్లు జ‌గ‌న్ స‌భ‌లో తెలిపారు. అంద‌రం క‌లిసి బాబు అవినీతి పాల‌న‌ను బంగాళఖాతంలో క‌లిపేద్దాం అని జ‌గ‌న్ స‌భా ముఖంగా అభిమానుల‌కు పిలుపునిచ్చారు.

SHARE