జగన్ నినాదంతో మార్మోగిన నరసరావుపేట.. పల్నాడులో టీడీపీ నాయకుల గుండెలో రైలు పరిగెడుతున్నాయి..

2155
0

గుంటూరు జిల్లా నరసరావుపేట జన సంద్రమైంది. రెడ్డి కాలేజ్ లో వైయస్సార్సీపీ నిర్వహించిన వైయస్ జగన్ బహిరంగసభకు జనం పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకంతా సభా ప్రాంగణం హోరెత్తింది. జై జగన్ నినాదాలతో మార్మోగింది. నరసరావుపేట వేదికగా కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాసు వెంకట క్రిష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. వైయస్ జగన్ మహేష్ రెడ్డికి పార్టీ కండువా కప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ నేతలు కోడెల ఆయన కొడుకకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర్రస్థాయిలో కోడెల అచారకాలపై ధ్వజమెత్తారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు పౌరుషాల గడ్డను దోపిడీకి అడ్డగా మార్చారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల నరసరావుపేటలో నిలబడలేక సత్తెనపల్లి వచ్చారు. అక్కడికి వచ్చాక ఎక్కడ చూసినా దోపిడే దోపిడీ. కోడెల ఒక్కరే కాదు..కొన్ని దూడలు కూడా ఏ చేలో పడితే ఆ చేలో పడి మేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా బలం లేని వ్యక్తులు పోలీసులను అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారు. నడికుడి నుంచి కాళహస్తి వరకు రైల్వే ట్రాక్‌ వేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి తెర లేపారు. మైనింగ్‌కు పర్మిషన్‌ కావాలంటే చిన్నబాబును కలవాలనే స్థితికి రెవెన్యూ డిపార్టుమెంట్‌ దిగజారిపోయింది. పల్నాడులో పోలీసు రాజ్యం నడుస్తోంది. కోడెల అబ్బాయి కోటిన్నర పాత డబ్బులు మార్పిడి కోసం కొందరిని భయాందోళనకు గురి చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ విమర్శించారు. మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తే..టీడీపీ నాయకులు సులభంగా వారి బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకున్నారని మండిపడ్డారు.

జగన్నినాదాలతో నరసరావుపేట మారుమ్రోగింది. వేలాదిగా తరలివచ్చి మహేశ్ రెడ్డి చేరికను స్వాగతించారు. కాసు చేరికతో వైసీపీకి భారీఎత్తున బలం చేకూరిందని, ఇక పార్టీకి తిరుగులేదని జిల్లాలో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని వైసీపీ నేతలు చెప్తున్నారు.

SHARE