సెక్స్ పట్ల ఎప్పటికీ ఆసక్తి తగ్గకుండా ఉండాలంటే ?

2565
0

చాలామంది తమకు టైం లేదు… బిజీ అంటుంటారు. కానీ అలా బిజీ బిజీ అంటూనే వృద్ధులయిపోతారు. వెనక్కి తిరిగి చూసుకుంటే విలువైన జీవితం కరిగిపోయిన మైనపు ముద్దలా కనబడుతుంది. మళ్లీ తిరిగి రాదు కదా.

  • ఎన్ని పనులున్నప్పటికీ రోజుకు కనీసం ఆరు గంటల పాటు నిద్రపోవాలి.
  • ప్రతి రోజూ ఓ గంట పాటు వ్యాయామం చేయాలి. వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివి. మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలి. ధ్యానం కూడా మీ లైంగిక శక్తిని పెంచుతుంది.
  • మారిన జీవన శైలికి అనువుగా వైద్య నిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రూట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు, ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది.
  • సన్నిహిత మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడంతో ఒంటరితనం పెరుగుతోంది. అందుకే వారానికి ఓ సారైనా పార్కులకు, రెస్టారెంట్‌లకు వెళ్లి మిత్రులతో కలిసి మెలిసి ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలి.
  • భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలి. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయమవుతుంది.
SHARE