నల్లధనం మారుస్తూ పట్టుబడ్డ టిడిపి మంత్రి భార్య…

14081
0

విజయవాడ, గుంటూరు కేంద్రంగా పెద్ద నోట్ల మార్పిడి దందా ప్రహసనంగా జరుగుతోంది. టీడీపీకి చెందిన మంత్రులు గత రెండువారాలుగా అన్ని పనులు మానేసి పాత కరెన్సీ కట్టలను మార్చే పనిలో బిజీగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి భార్య నోట్ల చలామణిలో దూసుకుపోతున్నట్లు కథనం. తనకు తెలిసినవారు, తన భర్త నుంచి సహాయం పొందిన వారిని అందర్నీ పలిపించి పాత నోట్లు అప్పగించి మార్చుకు రమ్మని పంపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. స్వయంగా మంత్రి భార్య ఆదేశించడంతో వారంతా మరోమాట మాట్లాడలేకపోతున్నారు. భర్త అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహకార సంఘాలు, విత్తన విక్రయ కేంద్రాలనూ నోట్ల మార్పిడికి వాడుకుంటున్నారు. భార్య అధికారం చెలాయిస్తుండడంపై మంత్రి గతంలోనే పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా సరే మంత్రి భార్య మాత్రం ఇంటికి చక్కదిద్దడంలో అన్నీతానై చూసుకుంటున్నారు. అధికారులంతా మంత్రి ఆదేశాలను పాటిస్తేం మంత్రి మాత్రం భార్య ఆదేశాలను ఫాలో అవుతుంటారని చెబుతున్నారు.

రాజధానికే చెందిన మరో మంత్రి ఏకంగా 500 కోట్లను మార్చేశారు. తన నెట్‌వర్క్‌ మొత్తం పాత నోట్లు మార్చేందుకు ఉపయోగించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడంలో ముందుండే సదరు మంత్రి కొందరు బ్యాంకు అధికారులకు నేరుగా ఫోన్‌ చేసి నోట్ల మార్పిడికి ప్రేరేపిస్తున్నారు. తమది పెద్ద శాఖ అని వేల కోట్లలో చేతులు మారుతుంటాయని కాబట్టి తమ వద్ద పెద్దనోట్లు చాలా ఉంటాయని వాటిని మార్చాలని ఒత్తిడి తెస్తున్నారు. ఒక ప్రైవేట్‌ బ్యాంకు ద్వారా కోట్లాది రూపాయలను మంత్రి మార్చేసుకున్నారని చెబుతున్నారు. గత రెండు వారాల్లోనే రూ.500 కోట్లను మంత్రి మార్చేశారని సమాచారం. అయితే ఒక వైపు నల్లధనాన్ని మార్చుకుంటూనే ఈ మంత్రి తిరిగి నల్లధనం గురించి ప్రెస్‌మీట్లు పెట్టి నీతులు చెబుతుండడం విశేషం.

SHARE