హైపర్ సెక్సువల్ డిజార్డర్ అంటే ఏమిటి

766
0

సెక్స్ కోరికలు ఉండటం అతి సహజమైన విషయం. ఇందులో లింగభేదం ఉండదు. ఆడవారైనా, మగవారైనా ఎవరికి ఉండాల్సిన రీతిలో వారికి సెక్స్ కోరికలు ఉంటాయి. అయితే కోరికలు ఉండటం వేరు విపరీతమైన కోరికలు ఉండటం వేరు. శృతిమించిన కోరికలు ఉంటే, ఆ కండీషన్ ని “హైపర్ సెక్సువల్ డిజార్డర్” అని అంటారు. ఇలాంటి కండీషన్ కి ఈ పేరుని 2010 సంవత్సరంలో ప్రపోజ్ చేశారు డాక్టర్లు. మరో ఆసక్తకరమైన విషయం ఏమింటంటే, ఈ డిజార్డర్ లక్షణాలని అంశంగా ఎంచుకోని హాలివుడ్‌లో సినిమాలు కూడా వచ్చాయి.

ఇక డిజార్డర్ యొక్క లక్షణాలను గమనిస్తే, మామూలు జనాలకి ఉండే సెక్స్ కోరికలకి, వీరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగితావారికి రోజులో కొద్దిసేపు సెక్స్ మీద ఆలోచనలు ఉంటే, వీరికి రోజంతా అదే పని. తాము ఎవరితోనో శృంగారిస్తున్నట్లుగా ఊహించేసుకుంటారు, అది కూడా రోజంతా, సమయం, సందర్భం లేకుండా. మరో విచిత్రమైన లక్షణం ఏమిటంటే, ఇలాంటివారిలో కొంతమందికి నగ్నంగా ఉండటం అంటే ఇష్టం. ఇంట్లో నగ్నంగా తిరిగేస్తుంటారు. ఇలాంటి కేసులో మన దేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి.

వీరు పోర్న్ ఫిలిమ్స్ కి బానిసలు. పోర్న్ వదిలి కాసేపు ఉన్న తట్టుకోలేరు. అతిగా హాస్తప్రయోగం చేస్తుంటారు. వస్తువు, మనిషి, జంతువు అనే తేడా లేకుండా, కామాన్ని కాసేపైనా చల్లార్చే మార్గాన్ని వెతుక్కుంటారు. అనారోగ్యకరమైన సెక్స్ అలవాట్ల వలన, ఈ డిజార్డర్ తో బాధపడేవారు STD’s కి గురవుతుంటారు. వీరిలో Paedophile కేసులు కూడా ఉంటాయి. మొత్తానికి కామంతో కళ్ళుమూసుకుపోయాయి అని కొందరిని అంటుంటామే .. ఈ డిజార్డర్ తో ఉన్నవారు అంతకుమించి.

SHARE