ప్రజలు శ్రేయస్సుకోరే ఒకే ఒక్క రాజకీయ నాయకుడు జగన్…!

1081
0

రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెయిన్ గన్ ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని ఆయన తెలిపారు.

పంటలు పండకపోగా లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, అక్కడికి వచ్చి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు సూర్యప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 19న కర్నూలు జిల్లా కొడుమూరులో రైతు సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఈ సభకు వైయస్ జగన్ గారు వస్తారు అని ఈ సందర్భంగా తెలిపిన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే మేటి రాజధాని నిర్మిస్తున్నానని, తన పాలన నంబర్ వన్‌గా ఉందని చంద్రబాబు ప్రచారం చేసుకోవటంపై ఆయన మండిపడ్డారు.

ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టినందుకు సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీకి ఫస్ట్ ర్యాంకు వచ్చిందా అని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద సర్వే చూస్తే 91.4 శాతంతో బాబు పాలనంతా అవినీతి, దోపిడీ జరుగుతోందని ఎన్‌సీఈఏఆర్ సర్వేలో తేలిందని, 74.3 శాతం పారిశ్రామికవేత్తలు ఇదే అంటున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మేధావుల నుంచి చంద్రబాబు ర్యాంకు పొందాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు చేపట్టిన నవ నిర్మాణ దీక్షలను నయవంచన దీక్షగా కోట్లు అభివర్ణించారు.

చంద్రబాబు తన చేతకానితనాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేసే పరిస్థితికి వచ్చారని కోట్లు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత బాబుకు లేదన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించిన టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అవినీతిపై కేసు ఉండదనీ, ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకు ఎమ్మెల్యేలపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ నెల 6న విశాఖలో జరిగే ‘జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో నేను కూడా పాల్గాటాను అని అన్నారు. వైఎస్ జగన్.. చంద్రబాబు చేతకానితనాన్ని, అసమర్థతను ఎండకడుతూ ప్రత్యేక హోదా పట్ల ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు.

SHARE