ఈనెల19న శ్రీకాకుళం జిల్లాకు జగన్.. టీడీపీ నేతల గుండెలో గుబులు..

3600
0

శ్రీకాకుళంలో రెండేళ్లకు ముందే రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలో ప్రజలకోసం ఎవ్వరూ పనిచేయట్లేదని. దాదాపుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి లేకుండా ఏపనీ జరగట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు పట్టణానికి ఈ రెండేళ్లలో కొత్తగా ఏమి చేసినట్లు లేదని ప్రజలు బాహాటంగానే అంటున్నారు. తోటపల్లి ప్రాజెక్టును కూడా గత పాలకులు శాంక్షన్ చేసిమరీ పనులు ప్రారంబించారు. దానిని వీరు నత్తనడకన పూర్తిచేశారు. దీంతోపాటు శ్రీకాకుళం పట్టణంలోని పొన్నాడ వంతెన పూర్తి చేసినా ఇంకా ప్రారంభించకపోవడం వెనుక రాజకీయ మార్కు కనిపిస్తోంది. ఈ రెండున్నరేళ్లలో సీఎం చంద్రబాబు జిల్లాకు సుమారు ఆరు సార్లు వచ్చినా జిల్లాకు ఏ మంచి చేయలేకపోవడంతో పాటు శ్రీకాకుళాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తానంటూ చంద్రాబాబు పదేపదే ఊదరగొట్టారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

జిల్లాలో డెవలప్ మెంట్ లేకపోగా కనీసం సామాన్యుల కష్టాలు తీర్చడంలేదని, యువకులకు ఉద్యోగాలు లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎన్నికలు హామీలు నెరవేర్చలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఓటమి భయంతోనే శ్రీకాకుళం కార్పోరేషన్‌కు ఎన్నికలను కూడా నిర్వహించట్లేదనితెలుస్తోంది. ఎన్నికల హామీల నేపధ్యంలో 2014లో ఈజిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలే వచ్చినా క్రమేపీ జిల్లాలో పార్టీ ప్రజాధరణ కోల్పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ పలుమార్లు పర్యటించారు. జగన్ యాత్రలకు జిల్లాలో ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన బాటలొనే కేంద్ర మాజీ మంత్రి – కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కొండ్రు మురళిలు త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఆమె పార్టీ మారుతారని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం మానేశారు. జిల్లాపార్టీ నేత ధర్మానతో ఆమె మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టే శ్రీకాకుళంలో మహిళలు రాజకీయంగా, పారిశ్రామికంగా అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంటూ అందరికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.

జిల్లాకు చెందిన ఎం.పి కిల్లి కృపారాణి కేంద్ర మంత్రిగా భాధ్యతలు నిర్వహించారు. జిల్లా లోని ఎమ్మెల్యేల్లో పది స్థానాలలో రెండు స్థానాలు మహిళలే శాసనసభ్యులుగా ఉన్నారు. మున్సిపాల్టి లలో ఇంతవరకు చైర్ పర్సన్ ల పేర్లే అధికంగా వినిపించాయి. ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి, ఎం.పి.పి సర్పంచ్ ఇలా క్షేత్ర స్థాయి నుండి జిల్లా రాజకీయాల్లో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఇక జిల్లా లోని మిగిలిన పార్టీలలో కుడా మహిళలదే పైచేయి. వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా లో ఇలాంటి మార్పు రావడం మంచి పరిణామం అంటున్నారు జిల్లా వాసులు. ఈ పరిస్థితుల్లో బలమైన మహిళానేత వైసీపీలో చేరుతుండడంతో ఆపార్టీనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాను డెవలప్ చేస్తానని పదేపదే వాగ్ధానాలిచ్చి ఆచరణలో విఫలమైన చంద్రబాబుపై జిల్లావ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లుతోందని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడడం, అమలుకాని ఎన్నికల హామీలు, ప్రత్యేక హోదానేపధ్యంలో టీడీపీపై జిల్లావ్యాప్తంగా అంతులేని వ్యతిరేకత ఏర్పడింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఈనెల 19న శ్రీకాకుళంలో ప్రత్యేకహోదాపై యువభేరి నిర్వహించేందుకు వెళ్తున్నారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జగన్ కు ఆహ్వానం పలికేందుకు జిల్లాపార్టీనేతలు సన్నద్ధమవుతున్నారు.

SHARE